‘సర్’ పై వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

కలం, వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా సవరణపై ఈసీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో (Supreme Court) నేడు విచారణ జరిగింది. విచారణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సమర్పించిన ప్రాథమిక సమాధానాన్ని పరిశీలించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో సమగ్రమైన వివరాలతో కూడిన సప్లిమెంటరీ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

విచారణలో భాగంగా ఓటర్ల జాబితాల సవరణలోని విధానాలు, ఫామ్-6 ప్రక్రియలో మార్పులకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని పిటిషనర్లు తరుఫున న్యాయవాది వాదించారు. అయితే, ఎన్నికల సంఘం తమ కౌంటర్‌లో స్పందిస్తూ, కమిషన్‌లో నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని, సీఈసీ ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదని తెలిపింది. దసరా సెలవుల కారణంగా ప్రాథమిక సమాధానం మాత్రమే ఇచ్చామని, పాయింట్ల వారీగా పూర్తి అఫిడవిట్ వేస్తామని కోర్టుకు వివరించింది.

ఈ క్రమంలో బాధ్యతాయుతమైన రాజ్యాంగ సంస్థగా పూర్తి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఈసీ విజ్ఞప్తిని అంగీకరిస్తూ సప్లిమెంటరీ అఫిడవిట్ సమర్పించేందుకు గడువు ఇచ్చింది. అన్ని వర్గాల వాదనలు, అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ రెండో వారానికి వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>