కలం, సినిమా : నేచురల్ స్టార్ నాని (Nani) తనదైన స్టైల్లో సరికొత్త మ్యాడ్‌నెస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నాని హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘బ్లడీ రోమియో’(Bloody Romeo) సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఆసక్తిని పెంచుతోంది. ‘వేడిని పెంచే ముందు చిన్నపాటి ప్రిపరేషన్’ అంటూ చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్టును షేర్ చేసింది. త్వరలోనే కిచెన్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నామంటూ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ పోస్టుతో నాని అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే ‘ప్యారడైజ్’ సినిమాతో తన కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. ‘బ్లడీ రోమియో’లో ఎలాంటి మ్యాడ్నెస్ చూపించబోతున్నారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆరా తీసిన నారా లోకేశ్..!
Follow Us On: Youtube

