Mobile Popup Ad
Mobile Popup Ad

నాంప‌ల్లి అగ్నిప్ర‌మాదం.. ఆఫీసులోనే ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ ఫైళ్లు?

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో (Nampally Forensic Lab) జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం (Fire Accident) రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భ‌వ‌నంలోని మొద‌టి అంత‌స్తులో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ మొద‌టి అంత‌స్తులోనే కంప్యూట‌ర్ ల్యాబ్‌తో పాటు ప‌లు కీల‌క గ‌దులు ఉన్నాయి. ఈ గ‌దుల్లోనే రాష్ట్రంలో ప‌లు కీల‌క కేసుల‌కు సంబంధించిన ఫైళ్లు భ‌ద్ర‌ప‌రిచిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు (Cash for Vote) కేసుకు సంబంధించిన ఫైళ్ల ఆధారాలు ఇందులోనే ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

నాంప‌ల్లి (Nampally) అగ్ని ప్రమాదం మాటున ఏం ఆధారాలు చెరిపేస్తున్నారని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ (Manne Krishank) ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ఓటుకు నోటు కేసులో ఆడియోలను ధ్వంసం చేస్తున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే రాజకీయంగా తయారు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఓటుకు నోటు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case), ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసుల‌కు సంబంధించిన ఫైళ్లు ఇక్క‌డే ఉన్న‌ట్లు చర్చ నడుస్తోంది. అలాగే ఈ ప్ర‌మాదం వెనుక కుట్ర కోణం ఉంద‌న్న అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. మంట‌లు అదుపులోకి వ‌స్తే గానీ ఫైళ్ల భ‌ద్ర‌త‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చేలా లేదు. ఐదు ఫైర్ ఇంజిన్ల‌తో అగ్ని మాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, ద‌ట్ట‌మైన పొగ కార‌ణంగా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు తీవ్ర ఆటంకం క‌లుగుతోంది. ల్యాబ్‌లోని స‌ర్వ‌ర్లు, కంపూట‌ర్లు, ఫైళ్ల భ‌ద్ర‌త‌పై అధికారులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Read Also: ఢిల్లీ చేరిన కవిత ఫైల్స్.. మూడు నెలల్లో కొలిక్కి…

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>