పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్లు జైలు శిక్ష

కలం, నల్లగొండ బ్యూరో: మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే కామాంధులకు చట్టం ముందు శిక్ష తప్పదని నల్లగొండ (Nalgonda) జిల్లా పోక్సో కోర్టు (POCSO Court) మరోసారి స్పష్టం చేసింది. తండ్రి వరుసయ్యే వ్యక్తే మృగంలా మారి 14 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. 2018, ఏప్రిల్ 20న నార్కట్‌పల్లి మండలం కొండపాలోనిగూడెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉప్పుతల దుర్గాప్రసాద్ అనే వ్యక్తి, తన సవతి కూతురు (14)పై కన్నేశాడు. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడగా, బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో భయపడి వదిలేశాడు. అక్కడి నుండి తప్పించుకున్న బాలిక ప్రాణభయంతో ఇంటికి చేరుకుంది.

ఏప్రిల్ 21, 2018న బాధిత బాలిక ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు దుర్గాప్రసాద్‌కు 7 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అన్యాయానికి గురైన బాలికకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అలాగే అప్పటి ఎస్‌హెచ్ఓ కె. గోవర్ధన్, ప్రస్తుత ఎస్‌హెచ్ఓ విష్ణు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు నరసింహ, కిరణ్, భరోసా సెంటర్ లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన చేసిన కృషిని ఉన్నతాధికారులు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>