జగన్ మాజీ CPRO శ్రీహరికి బెయిల్

కలం, వెబ్ డెస్క్ : మాజీ సీఎం జగన్ సీపీఆర్‌వో , వైసీపీ నేత పూడి శ్రీహరి (Pudi Srihari ) కి కుప్పం కోర్టులో ఊరట లభించింది. సీఎం చంద్రబాబు కి సంబంధించిన ఫోటోలు, అసభ్యకర పోస్టుల వ్యవహారంలో బెంగళూరులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ కుప్పం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కుప్పం కోర్టు పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది.

కాగా, సోషల్ మీడియాలో వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తూ తప్పుడు పోస్టులు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పూడి శ్రీహరి బెయిల్ పై పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. పూడి శ్రీహరి బెయిల్ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>