ఎంపీ చామలపై దుష్ప్రచారం.. కాంగ్రెస్ సీరియస్

కలం, నల్లగొండ : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై(MP Chamala) సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేయడం సరికాదని నల్లగొండ (Nalgonda) కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్వతం వేణు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అక్రమాలను, అక్రమాస్తులను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వరుసగా బయటపెడుతుండటంతో ఓర్వలేకనే ఆ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో నిందారోపణలకు దిగుతున్నారని పర్వతం వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన నికార్సైన నేతగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి  గుర్తింపు ఉందన్నారు. అవినీతి ఆరోపణలు బయటకు వస్తుండటంతో బీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేక ఇలాంటి చౌకబారు తప్పుడు ప్రచారాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇకనైనా ఇటువంటి దుష్ప్రచారాలు మానుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలే క్షేత్రస్థాయిలో తగిన రీతిలో బుద్ధి చెప్తారని పర్వతం వేణు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>