జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి.. కాంగ్రెస్ ధర్నాలో ఎమ్మెల్యేల డిమాండ్!

కలం, నాగర్ కర్నూల్: ఏకపక్ష విధానాలతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా సహకరిస్తున్న జాతీయ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి తొలగించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ (Nagarkurnool) కలెక్టర్ కార్యాలయ గేటు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా (Congress Protest) నిర్వహించారు.

ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేసే ప్రయత్నంలో భాగంగా రూ. 25 కోట్ల ఓట్లు తొలగించే కుట్రకు పాల్పడుతోంది అన్నారు. ఏక పక్ష ధోరణితో కేంద్రం, ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారు అన్నారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపు ఇచ్చారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని చిన్నాభినం చేసేలా ఎన్నికల కమిషనర్ చర్యలు ఉన్నాయి అన్నారు. బీజేపీ గెలుపు కోసం పని చేస్తున్న జ్ఞానేశ్ కుమార్‌ను ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. BLA, BLO లు అప్రమత్తంగా ఉండి అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని కోరారు.

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి మాట్లాడుతూ.. బెంగాల్‌లో ఓట్లు తొలగించి గెలిచినట్లుగా దేశంలో ఎన్నికల కమీషన్‌ను అడ్డం పెట్టుకొని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశం ఒక్క తాటిపైకి వస్తుంది అన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి వినతి పత్రం ఇచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>