కలం, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లా రాయచోటి (Rayachoti) ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిలిపి ఉంచిన నాలుగు 104 వాహనాల (104 Vehicles) అదృశ్యం స్థానికంగా చర్చకు దారితీసింది. మరమ్మతుల కారణంగా పక్కన పెట్టిన ఈ వాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారంటూ జిల్లా వైద్యాధికారి ఆరు నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాస్తవానికి ఈ వాహనాల (104 Vehicles) ను ఎవరి అనుమతి తీసుకోకుండానే కొందరు సిబ్బంది మున్సిపల్ డంపింగ్ యార్డుకు తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ ఈ వాహనాలను ధ్వంసం చేసి, వాటి విడిభాగాలను విక్రయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి డంపింగ్ యార్డులో వాహనాలను ముక్కలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వాహనాలు ఆసుపత్రి నుంచి డంపింగ్ యార్డుకు ఎలా వెళ్లాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.
Read Also: మావోయిస్టు లేఖపై స్పందించిన మంత్రి దుర్గేష్
Follow Us On : WhatsApp


