మురసు ఎఫెక్ట్: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

కలం, వెబ్ డెస్క్ : మురసు తుఫాన్ (Murasu Cyclone) ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేశారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా, మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

అలాగే ములుగు, హన్మకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడమైనది. రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>