ఆర్టీసీ ఉద్యోగులపై దాడులను అరికట్టాలి : జేఏసీ

కలం, నిర్మల్‌ : ఆర్టీసీ ఉద్యోగులపై దాడులను అరికట్టి, వారికి రక్షణ కల్పించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన కండక్టర్‌ గుండ్ల ప్రవళిక (30) చికిత్స పొందుతూ మృతి చెందడంపై బుధవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో వద్ద జేఏసీ (Nirmal RTC JAC) ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రవళిక చిత్రపటానికి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు గంగాధర్‌ మాట్లాడుతూ.. చిల్లర విషయంలో ప్రయాణికురాలితో జరిగిన వివాదంలో కండక్టర్‌ ప్రవళికపై దాడి జరగడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రవళిక మృతికి కారణమైన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని తగిన పరిహారం అందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>