కలం, జోగులాంబ గద్వాల: ప్రియదర్శిని జూరాల జలాశయానికి (Jurala Reservoir) వరద స్థిరంగా కొనసాగుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎగున నుంచి ప్రాజెక్టులోకి 18 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా, మంగళవారం సాయంత్రానికి 318.00 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలకు గాను 8.611 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల మీద ఆధారపడి ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించి 750 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అలాగే భీమా లిప్టు -1కు 1300 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిప్టుకు 630 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 30,000 క్యూసెక్కుల వరద నీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

