కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను బదిలీలు (DSPs Transfers) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఏసీపీలకు స్థాన చలనం కలిగింది. ఓయూ ఏసీపీగా నర్సింగరావు, ఉప్పల్ ఏసీపీగా వెంకట్‌రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీగా రణ్‌వీర్‌రెడ్డి, మలక్‌పేట ఏసీపీగా రాజా వెంకట్‌రెడ్డి, గోషామహల్ ఏసీపీగా చంద్రశేఖర్‌రెడ్డి, ఆసిఫ్‌నగర్ ఏసీపీగా శ్రీనివాస్, మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీగా వెంకటేశ్వరరావు, వికారాబాద్ జిల్లా ఏసీపీగా అంజయ్య, మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ ఏసీపీగా రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు.
వివిధ జిల్లాల్లో ఇలా..
పలు జిల్లాల్లో కొత్త డీఎస్పీలు నియమితులయ్యారు. జగిత్యాల డీఎస్పీగా పురుషోత్తంరెడ్డి, కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్, ఆసిఫాబాద్ డీఎస్పీగా అశోక్, భద్రాచలం డీఎస్పీగా అరుణ్‌కుమార్, నినిర్మల్ డీఎస్పీగా టీ శ్రీనివాస్ బదిలీ అయ్యారు. రాబోయే రోజుల్లో పోలీస్ శాఖలో మరికొన్ని బదిలీలు ఉంటాయనే చర్చ జరుగుతోంది.
Read Also: పుచ్చకాయ తిన్నాక నలుగురు మృతి.. పెద్ద మిస్టరీ
Follow Us On: WhatsApp

