ముధోల్‌లో పొలం రోడ్లపై ఎమ్మెల్యే ఫోకస్‌

కలం, భైంసా: ముధోల్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పొలం రోడ్ల పనులను(Farm Road Works) త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్‌ రామారావు పటేల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం భైంసాలోని తన నివాసంలో ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీవోలు, టీఏలు, ఈసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వీబీజీ రాంజీ పథకం కింద గ్రామాల్లో ఫార్మేషన్‌ రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిధులను సద్వినియోగం చేసుకుని రైతులకు ఉపయోగపడేలా రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే 24 గంటల్లో ప్రొసీడింగ్స్‌ అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి రైతుల సహకారం తీసుకుంటూ పొలం రోడ్ల పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీడీ నాగవర్ధన్‌, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>