సాంగ్వి గ్రామ పంచాయతీ భవనానికి నిధులు : ఎమ్మెల్యే

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కుబీర్ మండలంలోని సాంగ్వి (Sangvi) గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20 లక్షల నిధులు మంజూరైనట్లు ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామరావ్ పటేల్ ఆదివారం తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ భోజేందర్‌తో పాటు గ్రామ నాయకులకు నిధుల మంజూరు ప్రొసీడింగ్స్ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ భోజేందర్ గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం సహకారం అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>