జర్నలిస్టుల సంక్షేమానికి MSR ఫౌండేషన్ చేయూత

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఎంఎస్ఆర్ ఫౌండేషన్(MSR Foundation) అండగా నిలుస్తుందని ఫౌండేషన్ చైర్‌పర్సన్ మహతి రెడ్డి అన్నారు. ఆదివారం సీనియర్ జర్నలిస్ట్ ఆరగిద్ద అనిల్ కుమార్ భార్య రాఘవేంద్రమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మహతి రెడ్డి స్పందించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ చారి, డబ్ల్యూజేఐ కన్వీనర్ కటిక రవీందర్, ఐజేయూ అధ్యక్షుడు కాటం నాగరాజు ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా మహతి రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి మారెపల్లి సురేందర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఎంబీబీఎస్, నర్సింగ్ వంటి వైద్య విద్యకు దూరమవుతున్న విద్యార్థులను గుర్తించి, ఇప్పటివరకు ఫౌండేషన్ తరఫున తన శక్తి మేరకు ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ఫౌండేషన్‌ను అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశం తమకు లేదని, కేవలం సేవాభావంతోనే కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఫౌండేషన్ ద్వారా ఎవరికి ఆపద వచ్చినా తమ వంతు అండగా నిలిచి సహాయం అందిస్తామని మహతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గోవర్ధన్ గౌడ్, సంక్షేమ సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్, ఐజేయూ అధ్యక్షుడు కాటం నాగరాజు, మణి ప్రసాద్, రాఘవేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>