కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో సన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ రూమ్ (తల్లి, శిశువులకు పాలిచ్చే గది)ను ఎంపీ గోడెం నగేశ్ (MP Godam Nagesh) గురువారం ప్రారంభించారు. ప్రయాణ సమయాల్లో తల్లులు తమ చిన్నారులకు ప్రశాంతమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో పాలిచ్చేందుకు వీలుగా ఈ గదిని ఏర్పాటు చేశారు. ప్రజా రవాణా ప్రాంగణాల్లో ఇటువంటి సౌకర్యాలు కల్పించడం వల్ల బాలింతలకు ఇబ్బందులు తగ్గుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ పండరి, సన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

