Mobile Popup Ad
Mobile Popup Ad

పర్యావరణ పరిరక్షణకు భాగస్వాములు కావాలి: విప్ వేముల

కలం, రామన్నపేట: పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యతని గుర్తుచేశారు. కేవలం మొక్కలు నాటి వదిలేయడం కాకుండా, అవి వృక్షాలుగా మారేంతవరకు దత్తత తీసుకుని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత, పచ్చని వాతావరణాన్ని అందించేందుకు సహకరించాలని కోరారు.

మొక్కలు నాటే కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేముల వీరేశం కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన ఉచితంగా నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. అనంతరం వీరేశం (Vemula Veeresham) మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి లక్ష్యాలను ఏర్పరచుకుని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Read Also:  అందుకే విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>