లింబాద్రిగుట్టలో వైభవంగా నింబాచల స్వామివారి రథోత్సవ వేడుకలు!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్ట (Limbadri Gutta) నింబాచల లక్ష్మీ నరసింహ స్వామి  బ్రహ్మోత్సవాలు, జాతర అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారి రథోత్సవ పూజా కార్యక్రమాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం గోవిందా.. గోవిందా.. అనే భక్తుల నామస్మరణల నడుమ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భక్తులతో కలిసి స్వామి వారి రథాన్ని కొంత దూరం లాగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నింబాచల లక్ష్మి నరసింహ స్వామి వారి రథోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>