నిర్మ‌ల్‌లో విద్యార్థుల‌కు వ్యాస‌ర‌చ‌న పోటీలు

కలం, నిర్మల్‌: జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌, టీబీ అంశాలపై వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. వ్యాధులపై అవగాహన పెంపొందించడంతోపాటు విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అర్బన్ ఎంఈఓ సిద్ధ పద్మ, ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సీపీఎం నాగరాజు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంతోష్‌, రాజేందర్‌, చట్ల శ్రీనివాస్‌, మోరే శ్రీనివాస్‌, మసియుద్దీన్‌, ఆశా కిరణ్‌, ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>