ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త వైద్య సదుపాయం

కలం, ఖానాపూర్: ఖానాపూర్(Khanapur) పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కాన్ (Ultrasound Scan) మిషన్‌ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే అల్ట్రాసౌండ్ స్కాన్ సదుపాయం అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు.

ఇప్పటివరకు స్కానింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కొత్త సదుపాయంతో ఆ ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాలు, ఇతర సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వర్ణ రెడ్డితో పాటు వైద్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>