Mobile Popup Ad
Mobile Popup Ad

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయం: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

కలం మెదక్ బ్యూరో: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి (MLA Sanjeeva Reddy) అన్నారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని హంగిర్గ(కె) గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు పథకంలో భాగంగా నిర్మించిన గృహ ప్రవేశ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నూతన గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకాంక్షించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో సొంత ఇంటిని కట్టుకోవడం సంతోషంగా ఉందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎమ్మెల్యే సంజీవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>