కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి (Yellareddy)లోని బీసీ వసతి గృహంలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థిని శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఎల్లారెడ్డి (Yellareddy) బీసీ హాస్టల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న శ్రావణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఈ ఘటనతో ఎల్లారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

