తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: పవార్ రామారావు

కలం, బైంసా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) అన్నారు. బైంసా పట్టణంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పూలను పూజించే విశిష్టమైన సంప్రదాయం తెలంగాణలో ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెబుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>