కలం, నిర్మల్: కుభీర్ మండలంలోని న్యూ సావ్లీ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. పాఠశాలకు ప్రహరీ గోడ అవసరమని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, తక్షణమే ప్రహరీ గోడను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

