కలం, నిర్మల్: కుంటాల మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ బోనాల కుండలను నెత్తిన ఎత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులకు మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

