కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ (Huzurabad) లో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy), జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. హుజురాబాద్ పట్టణంలోని వ్యాపార, వాణిజ్య రంగాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. ర్యాలీ తరువాత ఆయన మాట్లాడుతూ, హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ (Dumping Yard) ఏర్పాటయితే ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే, ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు, దేశానికి నాణ్యమైన విత్తనాలను అందించే భూములు నాశనం అవ్వడం పెద్ద సమస్య అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) ప్రజలకు పిలుపునిచ్చి, రాజకీయాలను దాటుకొని అందరూ కలిసి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 7, 8 తేదీల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. బంద్‌కు సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: ఇంటర్‌నెట్ షట్ డౌన్ !
Follow Us On: Instagram

