కరీంనగర్ జిల్లాలో SIRని వందశాతం పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే మేడిపల్లి

కలం, కరీంనగర్: జిల్లాలో ఎస్ఐఆర్‌ని వందశాతం పూర్తి చేయడంలో కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipalli Satyam)  పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆరోపణలను తిప్పికొట్టడంతోపాటు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలన్నారు. గురువారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తూనే, పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ, రెండో విడతలో రెండు వేల ఇండ్లు కేటాయించారన్నారు.

ఇక నుండి ప్రతి 15 రోజులకు సమావేశం ఏర్పాటు చేస్తామని, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు జిల్లా రాష్ట్ర స్థాయి రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రతికార్యకర్త ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని వందశాతం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>