కలం, కరీంనగర్ బ్యూరో: మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ (Sushma Swaraj) వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని వివరించారు.
బీజేపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించి బిల్లు గట్టెక్కేలా చూశారని సునీల్ రావు వివరించారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆమెను ఆప్యాయంగా ‘చిన్నమ్మ’ అని పిలుచుకుంటారని గుర్తుచేశారు. పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ ప్రసంగాలు ఎంతో ఉత్తేజపూరితంగా, తార్కికంగా ఉండేవన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కెఏపిపి చంద్ర, సోషల్ మీడియా ఇన్ఛార్జి కటకం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

