epaper
Monday, February 23, 2026
epaper

నేను, నా తండ్రి ఏ తప్పు చేయలేదు : ఎమ్మెల్యే కేవీఆర్

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. చెప్పినట్టుగానే బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను కలిసి ఆర్.టి.ఐ అప్లికేషన్లు సమర్పించారు. కాలేజీ భూముల అన్యాక్రాంతంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి పూర్తి నివేదిక విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలకు కూడా ఆర్టీఐ కింద అప్లికేషన్లు ఇచ్చారు. అనంతరం కేవీఆర్ మీడియాతో మాట్లాడారు. 1964 నుంచి ఇప్పటి దాకా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు 263 ఎకరాల్లో దేనికోసం ఎంత కేటాయించారు.. ప్రజా అవసరాల కోసం చేశారా లేదా..? స్వార్థ ప్రయోజనం ఉందా అనేది తేల్చాలని కోరామన్నారు.

కొన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ అవసరాలు, ఇండస్ట్రియల్ ఏరియా, ఎఫ్ సిఐ గోడౌన్ కోసం అధికారుల సమక్షంలోనే గతంలో భూములు కేటాయించారని ఎమ్మెల్యే కేవీఆర్ (KVR) స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, తాను గానీ తన తండ్రి గానీ అవినీతి చర్యలకు పాల్పడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, వారికి అవసరమైన అన్ని పత్రాలు రెండు నిముషాల్లో తెప్పించుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించారు. అవి చేయకుండా కామారెడ్డిలో ఈ గొడవలు ఎందుకని కేవీఆర్ (KVR) ప్రశ్నించారు. షబ్బీర్ అలీ గతంలో మంత్రిగా, ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారని.. అప్పుడు, ఇపుడు ఈ అంశంపై ఎందుకు దృష్టి పెట్టలేదని అడిగారు. వైఎస్సార్ హయాంలో కామారెడ్డికి ఎందుకు తెలంగాణ యూనివర్సిటీని తీసుకు రాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిలో ఎనిమిదిన్నర ఎకరాల్లో ఇతరులు ట్రాక్టర్లతో దున్నినప్పుడు ఏం చేశారని ఎమ్మెల్యే కేవీఆర్ ప్రశ్నించారు. నివేదిక వచ్చాక ఈ ఎపిసోడ్ కు ముగింపు పలుకుతామని తేల్చి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>