కలం, నాగర్ కర్నూల్: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (MLA Kuchkulla Rajesh Reddy) అన్నారు. శనివారం నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా కేంద్రంలో, తెలకపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కవర్ షెడ్, సీసీ పేవ్మెంట్, చైర్మన్ చాంబర్, సమావేశ మందిరం, ఇతర నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్లో మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సౌకర్యవంతంగా విక్రయించే అవకాశం లభిస్తుందని అన్నారు. మార్కెట్కు వచ్చే రైతులు, వ్యాపారులు, సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏకలవ్య జయంతిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్, మున్సిపల్ చైర్మన్లు రమణ రావు, తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగయ్య, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఫడ్నవీస్.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

