epaper
Sunday, March 1, 2026
epaper

కాలువలు పూర్తి చేసి సాగునీరు ఇవ్వండి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో : దుబ్బాక (Dubbak) నియోజకవర్గంకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్ట్‌ల నుండి రామాయంపేట కాలువ, శంకరం పేట కాలువ, ఉప్పర్ పల్లి కాలువ, దుబ్బాక ప్రధాన కాలువల ద్వారా సాగునీటి అందించే సౌకర్యం ఉందని, కానీ ఉప కాలువలు పూర్తి కాకపోవడంతో పక్కన నీళ్లున్నా రైతులు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలపై గజ్వెల్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు .

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హాయంలో ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రధాన కాలువలు పూర్తి చేయడం జరిగిందని, కానీ ఉప కాలువలు పూర్తి కాకపోవడంతో నీళ్ళు ఉన్నా వినియోగించుకోలేక పోతున్నామని అన్నారు. ఉపకాలువలు పూర్తి అవుతేనే దుబ్బాక   నియోజకవర్గంలో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ప్రాంతమని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారు చొరవ తీసుకొని వెంటనే ఉప కాలువల నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. ఉప కాలువలు పూర్తి చేసి నీటిని అందించినప్పుడే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు.

Read Also:  ఆపరేషన్ కగార్‌ : దేశంలోనే చారిత్రాత్మక ఘట్టం.. మోదీ సంచలన ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!