సజ్జల విజయసాయిపై చేయి చేసుకున్నారా? కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : మంగళగిరిలో జరిగిన పార్టీ ప్లీనరీలో సజ్జల రామకృష్ణారెడ్డి తనపై నేరుగా భౌతికంగా దాడి చేశాడని వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. అయితే విజయసాయి రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని సజ్జల కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సజ్జల, విజయసాయి రెడ్డి వివాదంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే , గత వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయసాయిని సజ్జల కొట్టిన మాట వాస్తవమేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు . 2022లో జరిగిన పార్టీ ప్లీనరీ సమయంలో ఓ రూంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలోనే విజయసాయి రెడ్డిపై సజ్జల చేయ్యి చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయం ఏపీలో చాలా మందికి తెలుసునని పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి ఆరోపణలకు సజ్జల కౌంటర్ ఇవ్వడంతో వివాదం సద్ధుమణిగిందని భావిస్తున్న తరుణంలో కోటంరెడ్డి తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. మరి కోటంరెడ్డి వ్యాఖ్యలపై సజ్జల, వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>