బధిరులకు అండగా ఉంటాను: ఎమ్మెల్యే ధన్‌పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరు జిల్లాలోని బధిరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana) హామీ ఇచ్చారు. డెఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ… బధిరులకు ఎంతో మేధోశక్తి ఉంటుందన్నారు. సామాన్యులకు ధీటుగా పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. బధిరులుగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగులు సాధించి, స్థిరపడటం సంతోషంగా ఉందన్నారు. డెఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మహేష్, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>