Mobile Popup Ad
Mobile Popup Ad

హిందువుల్లో ఐక్యత పెరగాలి: ధన్ పాల్ సూర్యనారాయణ

కలం, నిజామాబాద్ బ్యూరో: హిందువుల్లో ఐక్యత పెరగాలని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) పిలుపునిచ్చారు. ఇందూరు నగరంలోని వినాయక్ నగర్ లో మంగళవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందువుల్లో ఇప్పటికీ చిన్న చిన్న భేద తారతమ్యాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా దూరం చేయాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ (RSS) నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాలకు అపూర్వ స్పందన వస్తుందని పేర్కొన్నారు. ప్రతి సమ్మేళనంలో సంఘ్ నుంచి వక్తలు చెబుతున్న మాటలను తూ.చా. తప్పకుండా పాటించాలని చెప్పారు. భవిష్యత్తు తరాలకు హిందూ సంస్కృతి సంప్రదాయాలను అందించాలని, ఇది అందరి భాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో వక్త, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి అప్పాల ప్రసాద్, కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>