ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాపై ఎమ్మెల్యే దానం సంచలన ఆరోపణలు

కలం, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ ఇళ్లకి లక్కీ డ్రా జరుగుతున్న తీరుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) అసహనం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ (Housing Board MD Gautham) అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. సరిగ్గా స్క్రూటినీ చేయకుండానే లక్కీడ్రా నిర్వహించారని తెలిపారు. ఖైరతాబాద్ లో 480 ఇళ్లకు బదులు 120 మాత్రమే వచ్చాయన్న ఎమ్మెల్యే దానం.. నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లలో 360 ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న దానికి పూర్తి భిన్నంగా గౌతమ్ చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎండీపై దానం సీరియస్

తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యం, అహంకారం ఉన్న అధికారిని తాను చూడలేదని వ్యాఖ్యానించారు. ప్రోటోకాల్ విషయంలో స్పీకర్ ఆదేశాలను తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎండీ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఇటీవల జరిగిన ఖైరతాబాద్ డబుల్ బెడ్ రూంల లక్కీ డ్రాను అధికారులు తాను రాకముందే ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. ఇలాంటి తప్పులు ఓల్డ్ సిటీలో చేస్తే కొట్టేవాళ్లంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అధికారులు వస్తుంటారు.. పోతుంటారు..తాము లోకల్ అని దానం అన్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ పై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని సూచించారు. అధికారుల వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు అసెంబ్లీలో ప్రశ్నిస్తానని దానం (Danam Nagender) హెచ్చరించారు.

Also Read : విదేశాల్లో పెళ్లిళ్లకు గుడ్‌బై చెప్పండి: ప్రధాని మోదీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>