కలం, వెబ్ డెస్క్ : ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి (Eshwar Sai)పై హైదరాబాదులోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరక సంబంధం పెట్టుకొని మోసం చేశాడని తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ (Madhuri Rathod) నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా తన ఫోన్ లో ఉన్న వ్యక్తిగత వీడియోలను ఉపయోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ద్వారా మార్ఫింగ్ వీడియోలు సృష్టించాడని ఆమె ఆరోపించారు. తనకు ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లుగా చూపిస్తూ ఏఐ వీడియోలు తయారు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన పరువు తీశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాధురి రాథోడ్ ఇచ్చిన ఆధారాల మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయి(Eshwar Sai)పై BNS యాక్ట్ 69 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈశ్వర్ సాయిని పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు.
Also Read : విదేశాల్లో పెళ్లిళ్లకు గుడ్‌బై చెప్పండి: ప్రధాని మోదీ
Follow Us On : WhatsApp

