రైతుల కష్టాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణం: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో తాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని , రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే, వారి సమస్యలపై దృష్టి సారించి పరిష్కార మార్గాలు అన్వేషించాల్సిన మంత్రులు అందుకు బదులుగా గొప్పలు చెప్పుకోవడం సరికాదని, రైతుల కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(MLA Chinta Prabhakar) విమర్శించారు.

కొండాపూర్ మండలంలో ఎండిన వరి పంటలను (Withering Paddy Crops)పరిశీలించిన ఎమ్మెల్యే.. విద్యుత్ అధికారితో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వరి పంటలు ఎండిపోతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని, సమస్యను వివరించినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వెంటనే జిల్లా విద్యుత్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు.

రైతులు పండించిన పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ సమస్యల కారణంగా నష్టపోవడం బాధాకరమని, అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. పంటలు ఎండిపోతూ తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ భరోసా ఇచ్చారు. రైతులకు అండగా నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>