కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి: ఎమ్మెల్యే భూపతి రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగులు చేస్తూ రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని నిజామాబాద్ (Nizamabad) రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. మంగళవారం మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామంలో బాడ్సి పీఏసీఏసీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా కాంటా వద్ద పూజలు చేసి కొనుగోలును ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు బంజారా సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్న సునీత – సుధాకర్ గృహ ప్రవేశ వేడుకలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే (MLA Bhupathi Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తండాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటను కేంద్రం కొనుగోలు చేయకుండా చేతులెత్తేస్తే.. రాష్ట్రం రైతు పక్షపాతిగా వ్యవహరించి రైతులకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేస్తుందని తెలిపారు. మొత్తం 739 కొనుగోలు కేంద్రాల ద్వారా పంట కొనుగోలు చేపడుతుండగా, అందులో మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ ఐకేపీ (IKP – Indira Kranthi Patham) వారికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. కాళేశ్వరం పేరుతో గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి చుక్క నీరందించిన దాఖలాలు లేవన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ.. పేదోళ్ల సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయరెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, యాదగిరి, సర్పంచ్, ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్ నాయక్, డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన్న, కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు అమృతాపూర్ గంగాధర్,ఉమ్మాజి నరేష్, ప్రతాప్ సింగ్, రాంచందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ తిరుపతి, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read Also: కోహ్లీతో దోస్తీ.. భారత్‌కు రానున్న జకోవిచ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>