అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాల ఫలితమే తెలంగాణ: బీర్ల ఐలయ్య

కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది ఉద్యమకారులు తమ జీవితాలను, సమయాన్ని, శక్తిని ధారపోశారని పేర్కొన్నారు.

ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ప్రతి ఒక్క ఉద్యమకారుడి సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>