కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీవ్ర విమర్శలు

కలం, నిర్మల్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) విమర్శించారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులతో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇచ్చే పార్టీ కాదని, బోగస్ చేసే పార్టీ అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణంలో ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ యువతలో నూతన ఉత్సాహం నింపడంతో పాటు పార్టీ బలోపేతమే లక్ష్యంగా నవంబర్ 11న నిర్మల్ పట్టణంలో 50 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి యువత పెద్ద ఎత్తున తరలివచ్చి యువ గర్జన పేరిట నిర్వహిస్తున్న సభ (BRS Yuva Garjana Sabha)ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల ఇంచార్జిలు రాంకిషన్ రెడ్డి, భూక్య జాన్సన్ నాయక్, పట్టణ అధ్యక్షులు రాము, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, మాజీ జెడ్పిటిసి జీవన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>