రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

కలం, తాంసి: తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌ (Mattadi Vagu Canal)కు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) బుధవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుబాటులో ఉన్న సాగునీటిని పొదుపుగా వినియోగించుకుంటూ పంటలకు సక్రమంగా అందించాలని కోరారు.

వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందవద్దని, ఎలాంటి కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని తెలిపారు. వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>