కలం, నేరడిగొండ: మహిళల ఆర్థిక స్వావలంబనకు, సంఘటిత శక్తికి మహిళా సమాఖ్య భవనాలు ఎంతగానో దోహదపడతాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (Anil Jadhav) అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహిళా సంఘాల బలోపేతానికి, సభ్యుల ఆర్థిక అభివృద్ధికి సమాఖ్య భవనాలు వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహిళలు సంఘటితంగా ఉంటూ ఆర్థికంగా ఎదిగేందుకు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అన్నారు. నూతన భవనాన్ని మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకుంటూ ఐక్యత, అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

