కలం, జోగులాంబ గద్వాల: అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం తుపత్రాల గ్రామంలో రైతుల నుంచి రూ.10 వేలు లంచం తీసుకున్న ఇద్దరు రవాణా శాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ పల్లయ్య (Kuruva Pallaiah) డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాష షేక్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఒక్కో రైతు నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై విచారణలో వాస్తవాలను వెల్లడించకుండా రవాణా శాఖ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రైతు సంఘాలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, మహేష్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

