హైదరాబాద్‌లో యువతి హత్య.. పరారీలో ప్రియుడు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మియాపూర్‌లో డాక్టర్ సృజన (Doctor Srujana) అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మూడు రోజుల కిందటే ఆమె హోటల్‌లో మరణించగా.. విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన సృజన హనుమకొండలో పీజీ పీడియాట్రిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ఆ తరువాత కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మొబైల్ లోకేషన్ ఆధారంగా ఒక హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించారు. శరీరం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. తమ కుమార్తెను రవి కుమార్ అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

చైన్ ఇస్తానంటూ పిలిపించి..

సృజన, రవి కుమార్ గతంలో ప్రేమలో ఉన్నారు. కొన్ని కారణాలతో గత ఆరు నెలలుగా రవి కుమార్‌తో సృజన దూరగా ఉంటున్నారు. ఆమె ఛైన్ రవి కుమార్ వద్దనే ఉండగా.. తిరిగి తీసుకోవాలంటూ హైదరాబాద్ లో కలుద్దామని కోరాడు. ఈ మేరకు 29న మియాపూర్‌లోని హోటల్‌లో గదిని బుక్ చేసి.. 30న హనుమకొండ నుంచి రప్పించాడు. ఏం జరిగిందో ఏమో.. మూడు రోజుల తరువాత ఆమె విగతజీవిగా గదిలో కనిపించారు. రవి కుమార్ తన కుమార్తెకు చైన్ ఇప్పిస్తానంటూ నమ్మించి, హత్య చేశాడని మృతురాలు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు హోటల్ నుంచి రవి కుమార్ వెళ్లిపోయినట్లుగా సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రవి కుమార్ పరారీలో ఉన్నాడని.. ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>