అవనిగడ్డలో దారుణం.. బాలికపై ఆర్ఎంపీ అఘాయిత్యం, 9 నెలల గర్భం!

కలం, వెబ్ డెస్క్: బాలికల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలవుతున్నా.. అత్యాచార ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ (Avanigadda) మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై 57 ఏళ్ల ఆర్ఎంపి డాక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తొమ్మిది నెలల గర్భంతో పాఠశాలకు రావడాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలిక ప్రసవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>