కలం, కరీంనగర్ బ్యూరో: నగర ప్రజలకు మరిన్ని ఆధునిక వసతులు కల్పించడంలో భాగంగా కరీంనగర్ నగరంలో నూతనంగా అధునీకరించిన ఐడీఎస్ఎంటీ (IDSMT Complex) షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నగరపాలక సంస్థకు చెందిన కాంప్లెక్స్ భవనాన్ని శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ సుడాకు చెందిన 79 లక్షల నిధులతో 48 షాపులుగా అధునీకరించిన ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్‌ను శుక్రవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే, నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ప్రారంభం చేశారు.
అనంతరం సుడాకు చెందిన 1.28 కోట్ల రూపాయల నిధులతో నైట్ ఫుడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నైట్ ఫుడ్ కోర్ట్ కాంప్లెక్స్ స్టాల్స్ నిర్మాణంతో పాటు పార్కింగ్ స్థలం, బెంచెస్ ఏర్పాటు, పిల్లల ఆట పరికరాలు, వాటర్ ఫౌంటెన్ లాంటి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేషం, మున్నూరు కాపు కార్పోరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, ఆర్టీఎ మెంబర్ పడాల రాహుల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, స్థానిక కార్పోరేటర్ వంగల పవన్, (మాజీ మేయర్) కార్పోరేటర్ రవీంధర్ సింగ్, కార్పోరేటర్లు వైద్యుల అంజన్ కుమార్, వరాల నర్సింగం చాడగొండ కవిత బుచ్చిరెడ్టి, సరిల్ల రాజకుమారి ప్రసాద్, అలీ, మల్లేషం, నగరపాలక సంస్థ, సుడా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

