కలం, రామగుండం: రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్(Raj Thakur) సోదరుడు ధర్మేందర్ సింగ్ సతీమణి ఉమారాణి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన దినకర్మ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu), ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉమారాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్, డీసీపీ, ఏసీపీ, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొని ఉమారాణికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు.

