Mobile Popup Ad
Mobile Popup Ad

అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి పొన్నం సమీక్ష

కలం, కరీంనగర్ బ్యూరో: ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ గౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘం లిమిటెడ్ భవనంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల వారిగా పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకోవాల్సిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు పెండింగ్ పనులు త్వరగా పూర్తి కావాలని పేర్కొన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్‌లను నియమించి సర్‌లో ఓట్ల తొలగింపు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే వర్షాకాలంలో గ్రామాల్లో ప్లాంటేషన్ చేయాలని, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో సమస్యలు రాకుండా 5 మంది రైతులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో మండలానికి ఒక్కో మెడికల్ కాలేజీ దత్తత తీసుకున్నారని, ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండల కార్యవర్గం పునర్వ్యవస్థీకరణ చేస్తామని, గ్రామాల్లో పార్టీ క్యాడర్ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే హుస్నాబాద్ నియోజకవర్గం గౌరవాన్ని పెంచుతామని చెప్పిన మాటను నిలబెట్టుకునేలా కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దొంత సుధాకర్,మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>