కలం, కరీంనగర్ బ్యూరో: అవసరం మేరకు రసాయనాలు వినియోగిస్తూ ప్రకృతిని రక్షించాలని, సాగు ఖర్చు తగ్గించి నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) రైతులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 60 సంవత్సరాల వ్యవసాయ విశ్వ విద్యాలయంలో అనేక మంది శాస్త్రవేత్తలను పట్టభద్రులుగా తయారు చేయడమే కాకుండా నూతన వంగడాలు ఆధునిక పద్ధతులపై పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్ళి అధిక దిగుబడి పొందడానికి అవసరమైన వంగడాలు, అధునాతన యంత్రాలు, అవసరమైన ఎరువులపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. రైతులు పంట మార్పిడి చేసుకొని ఆయిల్ ఫాం సాగు చేయాలని, ఆయిల్ ఫాంలో అధిక లాభాలున్నాయని తెలిపారు. ఆదర్శ రైతులకు శిక్షణ ఇచ్చి సాంకేతిక వ్యవసాయ మార్పులు గ్రామీణ ప్రాంతాల రైతులు చేరాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సేంద్రీయ ఎరువులు పంటలకు ఉపయోగించాలన్నారు. రసాయన ఎరువుల వల్ల అధిక దిగుబడి కాకుండా మన ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు. పంట మార్పిడితో సుస్థిర ఆదాయం సాధించాలని ఆయన (Minister Ponnam) సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, డా. ఝాన్సీ రాణి డీన్ ఆఫ్ అగ్రికల్చర్, పీజేటీఏయూ హైదరాబాద్, వ్యవసాయ పరిశోధన సహా సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలస డా. ఎస్.హరీష్ కుమార్ శర్మ, వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డా. రాంప్రసాద్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. హరికృష్ణ, శాస్త్రవేత్త డా. కె. మదన్ మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి తాటిపల్లి పున్నంచందర్ రెడ్డి, ఉద్యానవన అధికారిని మంజు వాణి, వ్యవసాయ విస్తరణ అధికారులు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Read Also: కాంగ్రెస్ హయాంలో అన్ని విభాగాల్లో అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి
Follow Us On: X(Twitter)

