కులగణన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా : వీ.హన్మంతరావు

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా కులగణన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వీ.హన్మంతరావు (Hanumantha Rao) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం గాంధీభవన్ (Gandhi Bhavan) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మూడు సార్లు ప్రధాని అయినా బీసీలకు న్యాయం జరగలేదని హన్మంతరావు ఆరోపించారు.

జనగణన జరుగుతున్నా.. కుల గణన చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మెజారిటీ శాతం ఉన్న ఓబీసీలకు ప్రధాని మోదీ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని మోదీ ఆలోచిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. వచ్చే నెల 10వ తేదీన మోదీ తెలంగాణకు వస్తున్నారని.. ఈ క్రమంలో ఆయనకు ఓబీసీలకి అన్యాయం చెయొద్దని కోరుతూ లేఖ రాస్తానని చెప్పారు. అలాగే, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని.. అప్పుడే దేశ ప్రజలకు న్యాయం జరుగుతుందని వీ.హన్మంతరావు (Hanumantha Rao) వెల్లడించారు.

Read Also: సింగూర్ ప్రాజెక్టుకు మహర్దశ.. విద్యుదీకరణ పునరుద్ధరణ పనులకు గ్రీన్ సిగ్నల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>